*బాలల హక్కులను పరిరక్షించాలి…*
*భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.*
*జిల్లా స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 18*
బాలల హక్కులను పరిరక్షిస్తూ , వారికి మెరు గైన భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని జిల్లా స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం రోజు జిల్లా మహిళా , శిశు , వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వ హించిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లాలోని ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లో పిల్లలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించాలని , వారి సంరక్షణ , రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధి కారులకు సూచించారు. బాలలకు సురక్షితమైన వాతావరణం కల్పించి , విద్య , ఆరోగ్యం , పోషకా హారం వంటి అంశాల్లో తగిన ప్రాధాన్యతనిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చిలుకూరి శ్రీనివాస్ , చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రుద్రమ , శివరాజు , ఇస్తారి , లేబర్ ఆఫీసర్ రాజు , డీఎల్ ఎస్ఏ ప్రతినిధి సాయి శ్రీనివాస్ , ప్రోగ్రాం ఆఫీసర్ వీణ , డీఎంహెచ్ఓ ప్రతినిధి , సీడీపీఓలు స్వరాజ్యం , శైలజ , అనంతలక్ష్మి , జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది , జిల్లాలోని అన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ల ప్రతినిధులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

