పోరుమామిళ్ల అభివృద్ధిే ధ్యేయం: షేక్ సునీహను భారీ మెజార్టీతో గెలిపించండి – వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి పిలుపు!

పోరుమామిళ్ల,కడప జిల్లా:నవంబర్ 18 ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గంలోని ప్రముఖ వైఎస్సార్‌సీపీ కేంద్రమైన పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి షేక్ సునీహ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదంతొక్కాయి.ఇందులో భాగంగా బుధవారం వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైశ్య బజార్ నందు విస్తృత స్థాయి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వైశ్య బజార్‌లో అపూర్వ స్వాగతం,ఇంటింటికీ నల్లేరు ప్రచారం వైశ్య బజార్‌కు చేరుకున్న నల్లేరు...