మేడ్చల్‌లో జాతీయవాదుల భారీ నిరసన ర్యాలీ:
ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
హైదరాబాద్ వేదికగా జరిగిన ‘భారత్ సమ్మిట్ 2026’లో భారత అంతర్గత వ్యవహారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ (PES) ప్రధాన కార్యదర్శి, ఇటలీ నాయకుడు జియాకోమో ఫిలిబెక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్‌లో భారీ నిరసన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మంగళవారం ఉదయం మేడ్చల్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ వివేకానంద విగ్రహం మీదుగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ వరకు భారీ ఎత్తున కొనసాగింది. ర్యాలీ అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న నాయకులు.. దేశ సార్వభౌమాధికారాన్ని కించపరిచేలా వ్యవహరించిన ఫిలిబెక్‌పై తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జియాకోమో ఫిలిబెక్.. భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేయడంతో పాటు, ప్రధాని మోదీని ఉద్దేశించి “వోట్ చోర్, గద్దీ ఛోడ్” అంటూ వివాదాస్పద నినాదాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..
భారత గడ్డపై నిలబడి ఒక విదేశీ పౌరుడు మన అంతర్గత రాజకీయాల్లోకి చొరబడి నినాదాలు చేయడం, దాన్ని కాంగ్రెస్ నాయకులు సమర్థించడం మన జాతికి, 140 కోట్ల భారతీయులకు జరిగిన ఘోర అవమానం.
”సందర్శక వీసాలపై దేశంలోకి వచ్చిన విదేశీయులు.. ఇక్కడి స్థానిక, దేశీయ రాజకీయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించడం వీసా నిబంధనల కింద స్పష్టమైన ఉల్లంఘన. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులు దీనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలఈ చర్యను ఫిలిబెక్ సొంత దేశమైన ఇటలీకి చెందిన సీనియర్ నాయకురాలు డెబోరా బెర్గమినీ సైతం తీవ్రంగా తప్పుబట్టారు. యూరోపియన్ నాయకులు భారత్‌కు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం సరికాదని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.విదేశీ శక్తులతో చేయి కలిపి దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్న దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. వెంటనే ఫిలిబెక్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసన ర్యాలీలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బొద్ది శ్రీనివాస్, మాజీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర నాయకులు విక్రం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోన శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ,జగన్ గౌడ్ జిల్లా నాయకులు శ్రీకాంత్ జిల్లా అధ్యక్షుడు అర్జున్ నియోజకవర్గం ఇంచార్జ్ సుదర్శన్ రెడ్డి మేడ్చల్ అధ్యక్షురాలు శైలజా హరినాథ్ నాయకులు శ్రీకాంత్ ,కృష్ణప్రియ, శ్రీనివాస్ గౌడ్ రాజు మహేష్ బాబు నాయకులు, జాతీయవాదులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

