📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎస్‌ఆర్ యూనివర్సిటీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం!

ఎస్‌ఆర్ యూనివర్సిటీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం!

📰 Generate e-Paper Clip

ఎస్‌ఆర్ యూనివర్సిటీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం!

లారీ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం.. కేసు నమోదు చేసిన హసన్‌పర్తి పోలీసులు

హసన్‌పర్తి, నవంబర్ 17, మన ప్రజావాణి :

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు హసన్‌పర్తి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన పనుగంటి వినయ్ రెడ్డి (20) ఎల్కతుర్తిలోని ఓ పెట్రోల్ బంక్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనం (టీ స్ -03-బిఏ -2196)పై విధులకు బయలుదేరాడు.

ఈ క్రమంలో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఎస్‌ఆర్ యూనివర్సిటీ దాటి వెళ్తుండగా, ఎల్కతుర్తి వైపు నుంచి హనుమకొండ వైపు వస్తున్న లారీ (టీస్ -05-యూబి -8568) డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వినయ్ రెడ్డి బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో వినయ్ రెడ్డి బైక్‌పై నుంచి వెనుక వస్తున్న కారుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడికి తల, కాళ్లు, శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వినయ్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మృతుడి తల్లి పనుగంటి అనూరాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ వెల్లడించారు.

రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలను బలితీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.