📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణMedchal-Malkajgiriబద్దం నరసింహారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి చేతుల మీదుగా చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ

బద్దం నరసింహారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి చేతుల మీదుగా చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, నవంబర్ 16: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్‌లో నూతనంగా మంజూరైన చేయూత ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.

పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి ముఖ్యంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలు, వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్లను అందిస్తోందన్నారు. నూతనంగా పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తిరుమల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.