*నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాల పంపిణీ 15వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్#
*అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం*
మేడ్చల్:- ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను 15వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు ప్రతినెలా ఆర్థిక భరోసా లభిస్తుందని, వారి నిత్యావసరాలకు కొంతమేర సహాయంగా ఉంటుందని తెలిపారు. వార్డులో అర్హులైన వారు ఎవరైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. కొత్తగా పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా కౌన్సిలర్ పేర్కొన్నారు.

