📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనర్సింహులపేటలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

నర్సింహులపేటలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

నర్సింహులపేటలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

నర్సింహులపేట, నవంబర్ 15 (ప్రజావాణి):
నర్సింహులపేట మండల కేంద్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్ పథకాల లబ్ధిదారులకు ఈ నెల 16వ తేదీ సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ పాదయాత్ర నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పెన్షన్ లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.