కోతులనడుమ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల దీపావళి సంబరాలు
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో హుస్నాబాద్ శాసనసభ్యులు,బీసీ సంక్షేమశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దీపావళి సంబరాలు ఘనంగా ఘనంగా చేసినాము.అనంతరం నన్నబోయిన రజిత నాగయ్య ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు మరియు కలిసి భోజనం చేసి,టపాసులు కాల్చి దీపావళి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. నాయకులు మాట్లాడుతూ
నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ,వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతూ,జీవితాంతం నీడనిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గొప్ప ఆశయమని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతోంది.ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో భాగస్వాములయ్యారు.
నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతోమంది కుటుంబాలకు భరోసాగా నిలుస్తోంది. వారు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ సర్పంచ్,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

