📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకడారి చామంతి లింగం వారి కుటుంబంలో సంప్రదాయబద్ధంగా దీపావళి ఘనంగా సంబరాలు

కడారి చామంతి లింగం వారి కుటుంబంలో సంప్రదాయబద్ధంగా దీపావళి ఘనంగా సంబరాలు

📰 Generate e-Paper Clip

*కడారి చామంతి లింగం వారి కుటుంబంలో సంప్రదాయబద్ధంగా దీపావళి ఘనంగా సంబరాలు*

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలు*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. నవంబర్ 9 (ప్రజా వాణి ): మంచాల
కడారి లింగం వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్నపిల్లలు, పెద్దలు కలిసి దీపావళి పండుగను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యానికి దూరంగా ఉంటూ, టపాసులు కాల్చకుండా ఇంటి ముందు దీపాలు వెలిగించి పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నోములు, వ్రతాలు ఆచరిస్తూ భక్తిభావంతో అమ్మవారిని పూజించుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సందేశంతో కడారి వారి కుటుంబం దీపావళి పండుగను ఆదర్శవంతంగా జరుపుకోవడం విశేషం. ఈ వేడుకలు కుటుంబ సభ్యుల బంధుమిత్రుల మధ్య ఆప్యాయత, పలకరింపు అనుబంధాలను మరింత బలోపేతం చేశాయి. కడారి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.