📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిజ్ఞానం వివేకం వికాసంలో మాదిగ విద్యార్థులు ముందుకు వెళ్లాలి

విజ్ఞానం వివేకం వికాసంలో మాదిగ విద్యార్థులు ముందుకు వెళ్లాలి

📰 Generate e-Paper Clip

విజ్ఞానం వివేకం వికాసంలో మాదిగ విద్యార్థులు ముందుకు వెళ్లాలి

మాదిగ విద్యార్థుల ఆత్మగౌరవానికి ప్రతీక ఎం ఎస్ ఎఫ్

ప్రజావాణి నవంబర్ 8 కమలాపూర్ మండల్ మాదిగ విద్యార్థులు ఎమ్మార్పీఎస్ సాధించిపెట్టిన ఎస్సీ వర్గీకరణ ఫలాలను సంపూర్ణంగా ఉపయోగించుకొని విజ్ఞానం వివేకం వికాసంలో మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవిందు నరేష్ అన్నారు

కమలాపూర్ అంబేద్కర్ భవనంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ మండల సదస్సు నిర్వహించగా ఈ సదస్సు అధ్యక్షత అంకిల రాజు వహించారు

ఈ కార్యక్రమంలో గోవింద్ నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కావడం వల్ల 9 శాతం రిజర్వేషన్లు మాదిగలకు అందుతాయని అన్నారు అయితే జనాభా ప్రతిపాదికన మాదిగలకు ఇవ్వవలసిన రిజర్వేషన్లు ఇంకా పెంచాలని డిమాండ్ చేశారు విద్యా ఉద్యోగ రంగాల్లో అమలవుతున్న వర్గీకరణ చట్టం వల్ల 9% రిజర్వేషన్లతో మాదిగలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పట్టారని అన్నారు వర్గీకరణను సాధించిన మందకృష్ణ మాదిగను నేటి తరం మాత్రమే విద్యార్థులు మర్చిపోవద్దని అన్నారు నేటి విద్యార్థులు వ్యక్తిగతంగా తమ జీవిత లక్ష్యాలను సాధించుకునే సామాజిక బాధ్యతగా జాతి అభివృద్ధి కోసం నిలబడాలని అన్నారు మొన్నటి తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో మాదిగలలో అక్షరాస్యత రేటు అతి తక్కువగా ఉందని వెల్లడి అయిందని కావున మాదిగలలో అక్షరాస్యత పెంచడం కోసం ప్రతి మాదిగ విద్యార్థి బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు మాదిగల్లో ప్రస్తుత తరం మరియు భవిష్యత్ తరాలు చదువుకునే విధంగా ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత నేడు చదువుకుంటున్న మాదిగ విద్యార్థుల మీద ఉందన్నారు మాదిగ విద్యార్థుల సంక్షేమం కోసం మరెవ్వరు రారని ఎం ఎస్ ఎఫ్ మాత్రమే సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని అన్నారు కావున ప్రతి మాదిగ విద్యార్థి ఎం ఎస్ ఎఫ్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు

అనంతరం నూతన ఎంఎస్ఎఫ్ మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎంఎస్ఎఫ్ కమలాపూర్ మండల కమిటీ అధ్యక్షుడు చరణ్ అధికార ప్రతినిధి అంకిల శివాజీ ప్రధాన కార్యదర్శి శనిగరపు అశ్వధామన్ ఉపాధ్యక్షుడు గోల్కొండ రతన్ శనిగరపు రాజు కార్యదర్శిగా చిలువేరు సిద్దు గోల్కొండ వంశీ సహాయ కార్యదర్శిలుగా పొడేటి గణేష్ శనిగిరపు రాకేష్ నియమితులైనారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ బొచ్చు తిరుపతి ఎంఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ఇన్చార్జి కుమ్మరి శ్రీనాథ్ ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి శనిగరపు రవీందర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గోల్కొండ శ్రీకాంత్ ఎం ఎస్పీ జిల్లా నాయకులు చిలువేరు సంపత్ ఎంఎస్పి మండల అధ్యక్షుడు చేరాలు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఇసంపల్లి రమేష్ ఎంఆర్పిఎస్ మండల అధికార ప్రతినిధి పుల్లా రవితేజ ఎంఎస్పి మండల ఉపాధ్యక్షులు కుమ్మరి ఏలియా గోల్కొండ నాగరాజు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.