*నకిలీ డెత్ సర్టిఫికెట్ తో కారుణ్య ఉద్యోగం-14 మంది అరెస్ట్*
*ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి*
*రూ.13 లక్షల ఒప్పందం- రూ.5 లక్షల నగదు స్వాధీనం-మూడు శాఖల అధికారులు అరెస్ట్*
*ఫేక్ ఫైళ్ల ముఠా అరెస్ట్- వైద్య మున్సిపల్,రెవెన్యూ అధికారుల చుట్టూ ఉచ్చు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం పొందిన ఉద్యోగి సహా14 మంది అరెస్ట్ అయ్యారు. మోసానికి సహకరించిన బంధువులు,మున్సిపల్,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని అరెస్ట్ చేసి రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.సిఆర్.నెo 299/2026యు /ఎస్ 318(4),336(3),338, 340(2),61(2), 212ఏ,236, 237 బి.ఎన్.ఎస్,65 ఐటి యాక్ట్,సెక్షన్36 ఆధార్ సెక్షన్, 25/రిజిస్టర్ ఆఫ్ బర్త్,డెత్ సెక్షన్ల కింద1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు.
*అసలు ఏం జరిగింది?*
శాలిగౌరారం పిహెచ్ సిలో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు 31-05-2025న పదవీ విరమణ పొందారు.కిడ్నీ సమస్యతో 17-11-2025న మరణించారు.26-11-2025న ఒగోడులో దశదిన కర్మలు జరిగాయి.
*మోసానికి పన్నిన కుట్ర:*
మృతుడు సర్వీసులో ఉండగానే మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తే, ఆయన కుమారుడు చామకూరి రాజుకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వస్తుందని నిందితులు పథకం వేశారు.ఈ కుట్రలో మృతుడి భార్య వసంత,కుమారుడు రాజు,బంధువులు రాజశేఖర్, రవీందర్,పిహెచ్ సి సీనియర్ అసిస్టెంట్ జగన్నాథరెడ్డి, వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. డిఎంహెచ్ఓకార్యాలయంలోని సిసి పోలె రంజిత్ కుమార్ ను సంప్రదించి రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది.
*ఆధార్ చిరునామా మార్పు -నకిలీ సర్టిఫికెట్:*
నల్లగొండలోని మీ సేవా నిర్వాహకుడు పనస చంద్రశేఖర్@చందు ద్వారా మృతుడి ఆధార్ లో చిరునామాను డీవీకే రోడ్, చైతన్యపురి కాలనీ,వార్డు నం.10,ఇంటి నం.500/1 గా మార్చారు.ఈ తప్పుడు ఆధార్ తో 28-05-2025న మరణించినట్లు నల్లగొండ మున్సిపాలిటీ నుండి నకిలీ డెత్ సర్టిఫికెట్ పొందారు. దరఖాస్తుపై పీజీ ఎస్పీ కానిస్టేబుల్ కట్ల సతీష్ ను సాక్షిగా పెట్టారు.వార్డు ఆఫీసర్ శివ జనార్ధన్,శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి,మీ సేవా ఏవో రాజశేఖర్,చందు కుమ్మక్కై ఈ సర్టిఫికెట్ ఇప్పించారు.
*వైద్య శాఖ అధికారుల పాత్ర:*
నకిలీ సర్టిఫికెట్ ఆధారంగా శాలిగౌరారం పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా.ఆకుల కృష్ణ సూర్య శిల్ప ఫైల్ ను బి ఎన్ హెచ్ ఓ కార్యాలయానికి పంపారు.అక్కడ సీనియర్ అసిస్టెంట్ గింకల రాకేష్, జూనియర్ అసిస్టెంట్ మోహన్ కృష్ణ, ఏవో మహబూబ్ అలీ, ఆఫీస్ సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి, సీసీ రంజిత్ కుమార్, పీహెచ్ సి సీనియర్ అసిస్టెంట్ జగన్నాథరెడ్డి తప్పుడు విచారణ నివేదికలు తయారు చేసి డిఎంహెచ్ ఓకు సమర్పించారు.దీంతో చామకూరి రాజుకు దామరచర్ల పిహెచ్ సిలో ఉద్యోగం వచ్చింది.
*స్వాధీనం చేసుకున్నవి:* నగదు రూ.5,00,000,ఒక కంప్యూటర్,ఒక ప్రింటర్,12 సెల్ ఫోన్లు,మృతుడి ఫొటో.
*అరెస్ట్ అయిన14మంది వివరాలు వెల్లడించిన ఎస్పీ*
1.చామకూరి వసంత నకిరేకల్,2.చామకూరి రాజు నకిరేకల్,3.చామకూరి రాజశేఖర్-కలెక్టరేట్ ఏవో పరారీలో ఉన్నాడు.4.
చామకూరి రవీందర్,హెల్త్ అసిస్టెంట్,కేతేపల్లి పరారీలో ఉన్నాడు.5.కంచర్ల జగన్నాథరెడ్డి సీనియర్ అసిస్టెంట్,శాలిగౌరారం పీహెచ్ సి,6.రాచకొండ వెంకటేశ్వర్లు @ వెంకట్ గౌడ్ ఒగోడు,7.డా. ఆకుల కృష్ణ సూర్య శిల్ప- మెడికల్ ఆఫీసర్,శాలిగౌరారం,
8.పనస చంద్రశేఖర్ @ చందు మీ సేవా నిర్వాహకుడు,9.కట్ల సతీష్ కంప్యూటర్ ఆపరేటర్, టీజీఎస్పి,10.ముక్కమొయిల శివ జనార్ధన్ వార్డు ఆఫీసర్, నల్లగొండ,11.ఎన్. ప్రదీప్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్,నల్లగొండ మున్సిపాలిటీ,12.పోలె రంజిత్ కుమార్ జూనియర్ అసిస్టెంట్,డిఎం హెచ్ ఓ ఆఫీస్,13.నాగిరెడ్డి జితేందర్ రెడ్డి ఆఫీస్ సూపరింటెండెంట్, దెయ్యం హెచ్ ఓ ఆఫీస్,14. మహబూబ్ అలీ ఏవో డిఎం హెచ్ ఓ ఆఫీస్ నల్లగొండ,15. గింకల రాకేష్ యాదవ్ సీనియర్ అసిస్టెంట్,
డిఎంహెచ్వో ఆఫీస్ నల్లగొండ,
16.తుంగతుర్తి మోహన్ కృష్ణ జూనియర్ అసిస్టెంట్,
డీఎంహెచ్వో ఆఫీస్ నల్లగొండ లను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు తేదీ 04-11-2026న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో డీఎస్పీ కె. శివరామిరెడ్డి పర్యవేక్షణలో సీఐ కె.ఆది రెడ్డి, ఎస్సైలు బి. శివప్రసాద్, డి.సైదాబాబు, ఎన్. వెంకట్ నారాయణ, జె.సైదులు బృందం ఈ మోసాన్ని ఛేదించింది
.

