📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్ బంద్ విజయవంతం....రైల్వే వంతెన పనులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలి....హామీ నిలబెట్టుకోకపోతే ఉద్యమం ఉధృతం...

ఘట్కేసర్ బంద్ విజయవంతం….రైల్వే వంతెన పనులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలి….హామీ నిలబెట్టుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం.. అఖిలపక్ష నాయకుల హెచ్చరిక.

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, నవంబర్ 2 (ప్రజావాణి): ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఘట్కేసర్ పట్టణ బంద్ విజయవంతమైంది. బంద్‌కు పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి సంపూర్ణంగా బంద్ పాటించారు.

ఈ సందర్భంగా ఘట్కేసర్ రైల్వే వంతెన నుంచి ఔటర్ రింగ్ రోడ్డులోని పాపన్న గౌడ్ చౌరస్తా వరకు అఖిలపక్ష నాయకులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే వంతెన నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేసి, డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. రైల్వే వంతెన నిర్మాణ పనులు సంవత్సరాలుగా కొనసాగుతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

బంద్ సందర్భంగా ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పి. కిరణ్ కాంట్రాక్టర్ సత్తిరెడ్డితో ప్రజల సమక్షంలో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా డిసెంబర్ నెలాఖరులోగా రైల్వే వంతెన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ ప్రజలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఘట్కేసర్ పట్టణ అభివృద్ధికి, ప్రజల రవాణా సౌకర్యానికి కీలకమైన రైల్వే వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బంద్‌కు సంపూర్ణ సహకారం అందించిన వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రజలు, వివిధ వర్గాల నాయకులకు అఖిలపక్షం తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.