📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్ నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర

ఘట్కేసర్ నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, నవంబర్ 2 (ప్రజావాణి): ఘట్కేసర్ నుంచి కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర భక్తిశ్రద్ధలతో చేపట్టేందుకు స్వాములు సిద్ధమయ్యారు. ఓం ఆదిత్య గురుస్వామి, అక్షయ్ గురుస్వాముల మార్గదర్శకత్వంలో ఈ మహాపాదయాత్ర కొనసాగనుంది.

ఈ యాత్రలో రేవంత్ రెడ్డి, రాజు రెడ్డి, గణేష్, యశ్వంత్, సాయిరాం, మధు, మధుసూదన్, శివ, సాయి, వినయ్, శ్రీధర్, రాకేష్ తదితర అయ్యప్ప స్వాములు పాల్గొననున్నారు.

అయ్యప్ప స్వామిపై అచంచలమైన భక్తి, గురుస్వాముల మార్గదర్శకత్వం, స్వాముల ఐక్యతకు ప్రతీకగా ఈ మహాపాదయాత్ర సాగనుంది. యాత్రలో అడుగడుగునా అయ్యప్ప నామస్మరణ చేస్తూ, కఠినమైన దీక్షా నియమ నిష్ఠలను పాటిస్తూ శబరిమల చేరుకుని స్వామివారి దర్శనం చేసుకోనున్నారు.

భక్తి, ఆధ్యాత్మికత, క్రమశిక్షణతో సాగనున్న ఈ మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని, యాత్రలో పాల్గొంటున్న స్వాములందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. స్వామియే శరణం అయ్యప్ప

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.