ఘట్కేసర్ బంద్ విజయవంతం….రైల్వే వంతెన పనులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలి….హామీ నిలబెట్టుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం.. అఖిలపక్ష నాయకుల హెచ్చరిక.

ఘట్కేసర్, నవంబర్ 2 (ప్రజావాణి): ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఘట్కేసర్ పట్టణ బంద్ విజయవంతమైంది. బంద్‌కు పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి సంపూర్ణంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ రైల్వే వంతెన నుంచి ఔటర్ రింగ్ రోడ్డులోని పాపన్న గౌడ్ చౌరస్తా వరకు అఖిలపక్ష నాయకులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే వంతెన నిర్మాణ పనులను...