వీరగోని బాలరాజు కు వీల్ చైర్ అందజేసి మానవత్వం చాటుకున్న ఏల సుందర్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02 (ప్రజావాణి):
జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరగోని బాలరాజు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటం వలన తీవ్రంగా కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. ప్రస్తుతం వారు ఇంటి వద్దనే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు ఏల సుందర్ సోమవారం హుటాహుటిన వీరగోని బాలరాజు నివాసానికి వెళ్లారు.
వారి కుటుంబ సభ్యులను కలిసి బాలరాజు ఆరోగ్య పరిస్థితి, జరుగుతున్న చికిత్స వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బాలరాజు నడవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని, వారి కోరిక మేరకు తక్షణ సహాయంగా వీల్ చైర్ (తోపుడు బండి) ని సుందర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున అందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలకు ముందుంటామని ఏల సుందర్ ఈ సందర్భంగా తెలిపారు.
వీల్ చైర్ అందజేసినందుకు వీరగోని బాలరాజు కుటుంబ సభ్యులు, బంధువులు ఏల సుందర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు చిలుపురం సోమయ్య, ఇంద్రసేన రెడ్డి, తోటకూరి కిష్టయ్య, గొడిశాల మల్లేష్, కారూపోతుల సారంగపాణి, ఉప్పల సామ్రాట్ తదితర బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

