📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetహుజూర్నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ‘జాతీయ ఐక్యతా దినోత్సవ’ వేడుకల ప్రత్యక్ష ప్రసార వీక్షణ.

హుజూర్నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ‘జాతీయ ఐక్యతా దినోత్సవ’ వేడుకల ప్రత్యక్ష ప్రసార వీక్షణ.

📰 Generate e-Paper Clip

హుజూర్నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ‘జాతీయ ఐక్యతా దినోత్సవ’ వేడుకల ప్రత్యక్ష ప్రసార వీక్షణ.

హుజూర్నగర్ నవంబర్ 1 (ప్రజావాణి)

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం హుజూర్నగర్ పోలీస్ స్టేషన్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కెవాడియా)లో జరుగుతున్న అధికారిక జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని (లైవ్ టెలికాస్ట్) హుజూర్నగర్ సిఐ చరమందరాజు ఆధ్వర్యంలో అందరూ కలిసి వీక్షించారు.

ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఎస్సై లు నరేష్, హనుమాన్ నాయక్ పాల్గొన్నారు.

దేశ ఐక్యత, సమగ్రత, మరియు భద్రతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. యువత మరియు విద్యార్థులలో దేశభక్తిని, ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు ఈ ప్రత్యక్ష ప్రసార వీక్షణ ఎంతగానో దోహదపడిందని సిఐ చరమందరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.