అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*
ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో కొనసాగుతున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు 129.25 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

