📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజోగిపేట యూనియన్ బ్యాంక్‌కు 18 వసంతాలు

జోగిపేట యూనియన్ బ్యాంక్‌కు 18 వసంతాలు

📰 Generate e-Paper Clip

*జోగిపేట యూనియన్ బ్యాంక్‌కు 18 వసంతాలు*

• ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూ నంబర్‌వన్ బ్యాంకుగా ఎదగాలి

• నూతన మేనేజర్ ఆదిత్య కుమార్ సేవలపై ప్రముఖుల ప్రశంసలు

మన ప్రజావాణి | జోగిపేట | అక్టోబర్ 31 | జిల్లా ప్రతినిధి

జోగిపేట పట్టణంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బ్యాంకు నూతన మేనేజర్ ఆదిత్య కుమార్ ఆహ్వానం మేరకు పలువురు ప్రముఖులు హాజరై మేనేజర్‌తో పాటు బ్యాంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాదారులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలు అందిస్తూ, వారి నమ్మకాన్ని చూరగొనాలని ఆకాంక్షించారు. రైతులకు పంట రుణాలు సకాలంలో అందించాలని, ఎస్సీ, బీసీ, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే సబ్సిడీ రుణాలు అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పెన్షన్లు అందించాలని కోరారు.

యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు సమర్థవంతంగా అందిస్తూ, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని పేర్కొన్నారు. ఎక్కువ మంది ఖాతాదారులను ఆకర్షించి, అన్ని రంగాల్లో ముందంజలో నిలిచి నంబర్‌వన్ బ్యాంకుగా ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు.

నాలుగు నెలల్లోనే ఖాతాదారుల మనసులు గెలుచుకున్న మేనేజర్

జోగిపేట యూనియన్ బ్యాంక్ నూతన మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య కుమార్ కేవలం నాలుగు నెలల కాలంలోనే ఖాతాదారుల మన్ననలు పొందారని ప్రముఖులు ప్రశంసించారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించడం, బ్యాంకు సిబ్బందితో కలుపుగోలుగా ఉంటూ సమన్వయంతో విధులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

బ్యాంకు 18వ వార్షికోత్సవం సందర్భంగా మేనేజర్ ఆదిత్య కుమార్‌తో పాటు బ్యాంకు సిబ్బంది అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ బ్యాంకు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), మాజీ ఎంపీపీ హెచ్. రామగౌడ్, సీనియర్ జర్నలిస్ట్ ఆకుల రాంబాబు, రవీందర్, సతీష్, అరుణ్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.