బీరంగూడలో ఫిట్స్‌తో కుప్పకూలిన వృద్ధుడు
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలని అమీన్పూర్ పోలీసుల విజ్ఞప్తి
అమీన్పూర్, అక్టోబర్ 31 (ప్రజావాణి):అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ జెనెసిస్ హైస్కూల్ సమీపంలో సుమారు వారం రోజుల క్రితం 60 నుంచి 70 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధుడు ఫిట్స్ రావడంతో రోడ్డుపై కుప్పకూలాడు. అతడిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే తన పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడు నల్లని శరీర ఛాయ, నలుపు తెలుపు కలిసిన జుట్టు, తెల్లని గడ్డంతో పాటు నీలం రంగు రౌండ్ నెక్ టీషర్ట్ ధరించి ఉన్నాడని వివరించారు. ఈ ఆనవాళ్లతో వృద్ధుడిని గుర్తించినవారు, కుటుంబ సభ్యులు లేదా బంధువులు వెంటనే అమీన్పూర్ పోలీసులను సంప్రదించాలని కోరారు. సమాచారం తెలిసినవారు ఎస్హెచ్ఓ: 8712656728, ఎస్ఐపీ: 8712581445, అమీన్పూర్ పోలీస్ స్టేషన్: 8712661842 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

