విషాదంలో ఉన్న గడ్డం కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం చేసిన 2009-10 పదో తరగతి స్నేహితులు
బెజ్జంకి,అక్టోబర్ 31 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామానికి చెందిన గడ్డం సాత్విక్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.పెద్ద కుమారుడైన సాత్విక్ మరణాన్ని తట్టుకోలేక పది రోజుల వ్యవధిలోనే ఆయన తండ్రి గడ్డం మధు గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబం మరింత శోకసంద్రంలో మునిగిపోయింది.ఈ కష్ట సమయంలో మానవత్వంతో స్పందించిన గడ్డం మధు సోదరుడు గడ్డం మహేష్‌కు చెందిన 2009-10 పదో తరగతి బ్యాచ్ స్నేహితులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.స్నేహితులందరూ కలిసి రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ స్నేహబంధాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు.

