కొండేపి నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారం
ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 30
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ జరుగుమల్లి మండలంలోని తూమాడు, పాలేటి పాడు, వావిలేటిపాడు, బిట్రగుంట, సాదువారిపాలెం, చింతలపాలెం, పంగులూరి వారి పాలెం చెరుకూరపాడు, దావగూడూరు, నర్సింగోలు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర మారి టైం బోర్డు చైర్మన్ అండ్ జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య ఈ సందర్భంగా జెడ్పిటిసిలు మరియు ఎంపీటీసీలు అభ్యర్థులను కార్యకర్తలకు పరిచయం చేస్తూ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో కూటమి నాయకులు,కార్యకర్తలు ప్రతి ఒక్కరు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమిత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి గడపగడపకి తెలియపరచాలని మాట్లాడారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం గెలుపే లక్ష్యంగా ముందుకు కొనసాగాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామం పంచాయతీ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


