📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కేటీఆర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన వరికుప్పల లింగస్వామి

కేటీఆర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన వరికుప్పల లింగస్వామి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 22 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ సర్కిల్ పరిధికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు వరికుప్పల లింగస్వామి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వరికుప్పల లింగస్వామి మాట్లాడుతూ విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నాయకులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పండుగలు ప్రజల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని వరికుప్పల లింగస్వామి పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.