కేటీఆర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన వరికుప్పల లింగస్వామి

ఘట్‌కేసర్, అక్టోబర్ 22 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ సర్కిల్ పరిధికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు వరికుప్పల లింగస్వామి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వరికుప్పల లింగస్వామి మాట్లాడుతూ విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం...