📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి

ప్రజల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

*ప్రజల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి*

*మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు*

* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాళ్లవాగు బ్రిడ్జి పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు, వాహనదారులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మట్టి రోడ్డును ఏర్పాటు చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు, మున్సిపల్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన రాళ్లవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను సంబంధిత అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ, నిర్మాణ పనుల సమయంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజా సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యత అని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా ఆర్జిపిఆర్ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.