నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏడో రోజు బతుకమ్మ పండుగా ఉత్సవాలు
ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట:
నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏడో రోజు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి, స్థానిక గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకు, మహిళలకు, అక్కాచెల్లెళ్లకు, యువతకు, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈరోజు మనం జరుపుకుంటున్నది బతుకమ్మ పండుగలో ఏడో రోజు అయిన వేపకాయల బతుకమ్మ.
బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదు. అది మన తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, మన సంస్కృతికి, సంప్రదాయాలకు, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక అన్నారు,మరియు ఎంపిడివోఅంజలి గారు మాట్లాడుతూ
తెలంగాణలోని ప్రతి ఆడపడుచు బతుకమ్మ పండుగ కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తుంది. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, అందరూ కలిసి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ జరుపుకునే ఈ పండుగ మనందరిలో ఐక్యతను పెంపొందిస్తుంది అన్నారు. ఉప సర్పంచ్ కాస యాకయ్య గారు మాట్లాడుతూ
ఆలిగిన బతుకమ్మ పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున బతుకమ్మను అలకతో ఉన్న అమ్మవారిగా భావించి పూజించే సంప్రదాయం ఉంది. ప్రాంతాలను బట్టి ఆచారాలు, పాటల్లో కొంత తేడా ఉండవచ్చు అన్నారు.. కార్యదర్శి అశోక్ గారూ మాట్లాడుతూ
మన బతుకమ్మ పండుగ మనకు నేర్పించే ముఖ్యమైన సందేశం ఏమిటంటే — మనమందరం కలిసిమెలిసి ఉండాలి, మన సంప్రదాయాలను కాపాడుకోవాలి, మహిళలను గౌరవించాలి, ప్రకృతిని ప్రేమించాలి.
ఈరోజు మనం ఒక సంకల్పం తీసుకుందాం. మన తెలంగాణ సంస్కృతిని మన భావితరాలకు అందిద్దాం. పూలను, చెట్లను, ప్రకృతిని కాపాడుకుందాం. ఆడపడుచుల ఆనందంలో పాలుపంచుకుందాం. మన గ్రామంలో ఐక్యతను మరింత బలోపేతం చేద్దాం.
చివరిగా, మన నర్సింహులపేట మండల ప్రజలందరికీ, మన గ్రామంలోని ప్రతి ఆడపడుచుకు ఆలిగిన బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఅన్నారు.. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీఓ గారు, గౌరవ వార్డు మెంబర్లు కొంపల్లి యకన్న, అనిత , విజయ, అంగన్ వాడి టీచర్లు, గ్రామ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు..

