సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్యను ఘనంగా సన్మానించిన నవయువ యూత్ సభ్యులు
బెజ్జంకి, అక్టోబర్ 13 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని అంబేద్కర్ నవయువ యూత్ దుర్గాదేవి ఉత్సవ కమిటీకి గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య సౌండ్ సిస్టమ్, బాక్సులను విరాళంగా అందజేశారు. అనంతరం నవయువ యూత్ సభ్యులు సర్పంచ్ మల్లయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, దుర్గాదేవి ఉత్సవాల నిర్వహణకు సహకరించి సౌండ్ సిస్టమ్, బాక్సులను అందజేసిన సర్పంచ్ మల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నవయువ యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

