📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్జనం నోట్లో మన్ను కొట్టి.. బిల్లు లేకుండా లక్షల దందా

జనం నోట్లో మన్ను కొట్టి.. బిల్లు లేకుండా లక్షల దందా

📰 Generate e-Paper Clip

*జనం నోట్లో మన్ను కొట్టి.. బిల్లు లేకుండా లక్షల దందా!*
. తనిఖీలకు వణుకుతున్న మెడికల్ షాపులు.. తెరపైకి వస్తున్న నిజాలు.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
గోవిందరావుపేట ‌మండలం
పసర గ్రామంలో మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేశారు. SI తాజుద్దీన్ గారు, డ్రగ్ ఇన్ స్పెక్టర్ గారు షాపుల్లోకి వెళ్లి బిల్లులు, మందులు చెక్ చేశారు.
అప్పుడు ఒక విషయం బయటపడింది. ఒక షాపులో 2025 బిల్లుల్లో సరైన వివరాలు లేవు. మందు పేరు, కంపెనీ, ధర, ఎక్స్ పైరీ డేట్ కూడా సరిగ్గా రాయలేదు.
ఇది పెద్ద తప్పు. మందులు కొన్నప్పుడు బిల్లు ఇవ్వడం షాపు వాళ్ల బాధ్యత. బిల్లు ఉంటేనే మనం ఎంత డబ్బు కట్టామో, ఏ మందు కొన్నామో తెలుస్తుంది.
కానీ పసరలో కొన్ని షాపుల్లో బిల్లు అడిగితే ఇవ్వడం లేదని జనం చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.
బిల్లు లేకపోతే నకిలీ మందు ఇచ్చినా, ఎక్కువ డబ్బు తీసుకున్నా మనకు తెలియదు. తర్వాత ఎవరినీ అడగలేం.
అందుకే అధికారులు చెబుతున్నారు.. మందులు కొన్న ప్రతిసారీ బిల్లు తప్పనిసరిగా తీసుకోండి. బిల్లు మీ హక్కు.
ఒకవేళ బిల్లు ఇవ్వకపోతే భయపడొద్దు. అధికారులకు చెప్పండి. అలాంటి షాపులపై చర్యలు తీసుకుంటారు.
మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే ఉంది. బిల్లు అడగండి.. మోసపోకుండా ఉండండి.
*తనిఖీలకు వణుకుతున్న మెడికల్ షాపులు.. తెరపైకి వస్తున్న నిజాలు!*

SI తాజుద్దీన్, డ్రగ్ ఇన్ స్పెక్టర్ తనిఖీలకు వచ్చారని తెలియగానే పసరలోని పలు మెడికల్ షాపుల్లో హడావుడి మొదలైంది. ఉన్నఫలంగా షట్టర్లు దించేసిన వాళ్లు కొందరైతే, రికార్డులు సర్దడంలో బిజీ అయిన వాళ్లు మరికొందరు. తనిఖీ చేసిన ఒక షాపులో బిల్లుల్లో కంపెనీ పేరు, ధర, గడువు తేదీలు లేకపోవడం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఒక్క షాపులోనే ఇలా ఉంటే, మిగతా షాపుల్లో ఇంకెన్ని లోపాలు ఉన్నాయోనని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ తనిఖీలు ఒక్కరోజుతో ఆపకుండా ప్రతి వారం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే అసలు నిజాలు పూర్తిగా బయటకు వస్తాయని అంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.