టి జి ఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ…!
పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ దివాకర్ టీఎస్
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు, అసోసియేషన్ ఖమ్మం జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ టీజీవో మహిళ అధ్యక్షులు జి ఉషా శ్రీ, కార్యదర్శి పి సుధారాణి ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఐ డి ఓ సి కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ దివాకర టి.ఎస్.,డాక్టర్ పి. శ్రీజ, ముఖ్య అతిథులుగా బతుకమ్మ సంబరాల పోస్టర్ను ఆవిష్కరించారు .
టీజీవో జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు, టీజీఓ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి, పూల వైభవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగని ఈ పండుగ విశిష్టతను చాటి చెప్పడంతో పాటు, మహిళా అధికారుల మధ్య సోదరభావం, ఐక్యత, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో మహిళా విభాగం బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీజీ ఓస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు , కార్యదర్శి మోదుగు వేలాద్రి, మహిళ కార్యవర్గ సభ్యులు, గుడికందుల జ్యోతి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్, శ్రీమతి విజయ కుమారి ప్రిన్సిపల్ టిజిఓ రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు, ప్రమీల డి డబ్ల్యు ఓ రాధిక మున్సిపాలిటీ ఉద్యాన శాఖ అధికారి మాధవి జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, కరుణ శ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, నాగలక్ష్మి, మాధవి, కుసుమకుమారి, ఇందిరా, మాధవి, నాగమణి, మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా గెజిటెడ్ అధికారులు, ఉద్యోగినులు మరియు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

