📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కోలుకొండలో లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

కోలుకొండలో లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

కోలుకొండలో లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 14(ప్రజావాణి):లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320F, రీజన్ 6 – జనగామ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా జిల్లా లోని దేవరుప్పుల మండలం, కోలుకొండ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ శిబిరానికి రీజన్ చైర్మన్ లయన్ డాక్టర్ జైన రమేష్, ఏరియా లీడర్ లయన్ రాజశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కోతి స్రవంతి ప్రవీణ్, పూర్వ జిల్లా గవర్నర్, రీజన్ అడ్వైజర్ కన్నా పరశురాములు, లయన్ లగిశెట్టి శంకర్ లింగం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుమారు 100 మంది గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం 15 నుంచి 20 మందిని కంటి శస్త్రచికిత్సలకు అర్హులుగా గుర్తించారు.

అర్హులుగా గుర్తించిన వారిని రాబోయే బుధవారం జనగామలోని వైఎస్సార్ భవన్‌కు రావాలని సూచించారు. అక్కడి నుంచి వారిని హనుమకొండలోని లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు రీజన్ చైర్మన్ లయన్ డాక్టర్ జైన రమేష్ తెలిపారు.

ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.