📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జల్లిపల్లి–పీఏబీఆర్‌ డ్యామ్‌ రహదారికి మరమ్మతులు చేయాలని కలెక్టర్ కీ వినతి పత్రము

జల్లిపల్లి–పీఏబీఆర్‌ డ్యామ్‌ రహదారికి మరమ్మతులు చేయాలని కలెక్టర్ కీ వినతి పత్రము

📰 Generate e-Paper Clip

జల్లిపల్లి–పీఏబీఆర్‌ డ్యామ్‌ రహదారికి మరమ్మతులు చేయాలని కలెక్టర్ కీ వినతి పత్రము

అనంతపురం అక్టోబర్ 12 ప్రజావాణి కూడేరు మండలం జల్లిపల్లి నుంచి పీఏబీఆర్‌ డ్యామ్‌ వరకు పూర్తిగా దెబ్బతిన్న రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని సోమవారం బిజెపి మండలఅధ్యక్షులు బి గోపాల్ బిజెపి జిల్లా మోర్చా ప్రధాన కార్యదర్శి కోయిల రామాంజనేయులు తదితరులు వినతి పత్రం అందసేశారు ఈసందర్బంగా వారు మాట్లాడు తూ
ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం, కూడేరు మండలం, జల్లిపల్లి గ్రామం మరియు పరిసర గ్రామాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని జల్లిపల్లి నుంచి పీఏబీఆర్‌ డ్యామ్‌ వరకు ఉన్న ప్రధాన రహదారిని పూర్తిగా అభివృద్ధి చేసి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
ఈ రహదారి చాలా కాలంగా అధ్వానంగా ఉంది. రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జల్లిపల్లి గ్రామ ప్రవేశం వద్ద నుంచి పీఏబీఆర్‌ డ్యామ్‌ వైపు వెళ్లే రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ రహదారి కేవలం జల్లిపల్లి గ్రామ ప్రజలకే కాకుండా వందలాది గ్రామాల ప్రజలకు కీలకమైన అనుసంధాన రహదారిగా ఉంది. రాయదుర్గం, కనేకల్లు, బెలుగుప్ప, ఉరవకొండ, కూడేరు మండలాల పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు.
రహదారిపై ప్రతిరోజూ విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు, రోగులు, మహిళలు, ఇతర ప్రజలు ప్రయాణిస్తున్నారు. రహదారి దెబ్బతిన్న కారణంగా వారి రోజువారీ ప్రయాణం చాలా కష్టంగా మారింది.
ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి ఎక్కడ ఎంత లోతుగా ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఈ రహదారి చాలా ముఖ్యమైనదిగా ఉందన్నా రు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.