📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్చూచిరేవుల గూడెంలో టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపై గెలుపు వ్యూహాలకు ప్రణాళిక

చూచిరేవుల గూడెంలో టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపై గెలుపు వ్యూహాలకు ప్రణాళిక

📰 Generate e-Paper Clip

చూచిరేవుల గూడెంలో టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపై గెలుపు వ్యూహాలకు ప్రణాళిక

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 11

పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం చూచిరేవుల గూడెం ఎంపీటీసీ పరిధిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, ముఖ్య కార్యకర్తలతో కూనవరం మండల టీడీపీ అధ్యక్షుడు ఎడవల్లి భాస్కరరావు, మండల ప్రధాన కార్యదర్శి అప్పారావు* సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు చర్చించారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేయడం, ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించడం, బూత్‌ల వారీగా ఓట్ల వివరాలను సేకరించడం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నాయకులకు సూచించారు.
ప్రతి బూత్‌లో పార్టీ బలాబలాలను అంచనా వేస్తూ, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగాలని, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో చూచిరేవుల గూడెం ఎంపీటీసీ పరిధి యూనిట్ ఇన్‌ఛార్జి దాసరి నాగేశ్వరరావు, బూత్ ఇన్‌ఛార్జి జిగిని విజయ్, సీనియర్ నాయకులు శ్రీమంతుల సతీష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు కరక సర్వేశ్వరరావు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు ముప్పెనబోయిన నాగరాజు, మాజీ సర్పంచ్ కీకర ముత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల గోపాలకృష్ణ, మాడెం సీతారామయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు దన్నూరి శ్రీనివాసరావు, కర్నాటి శ్రీను, అనిగి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా నాయకులు చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.