📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెద్ద శంకరంపేట లోప్రజావాణి స్పందన కు కరవు

పెద్ద శంకరంపేట లోప్రజావాణి స్పందన కు కరవు

📰 Generate e-Paper Clip

*పెద్ద శంకరంపేట లోప్రజావాణి స్పందన కు కరవు*
*పెద్ద శంకరంపేటలో ప్రజావాణి ఎందుకు?*

*పశువైద్యశాల అర్జీ కోసం 2 నెలలు గా తిరిగిన పశు వైద్యాధికారి*

*నడిరోడ్డుపై చెత్త గురించి ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా స్పందన కరువు!*

*పశువైద్యశాల కోసం 2 నెలల నిరీక్షణ – చివరకు సొంత డబ్బులతో మరమ్మత్తులు*

*నడిరోడ్డుపై చెత్తకుప్పలు – ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్!*

*ఇంకా ప్రజల సమస్యలు ఏం తీరుస్తారు?*

*ప్రజావాణి న్యూస్ పెద్ద శంకరంపేటప్రతినిధి (12-10-2026):*

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ప్రజావాణి పూర్తిగా నిర్వీర్యమైంది. ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్పి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, ఇప్పుడు కేవలం మొక్కుబడి తంతుగా మారిందని మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో జరిగిన తాజా ఘటన ప్రజావాణి వైఫల్యానికి నిదర్శనం. మండల కేంద్రంలో ఉన్న పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం వస్తే లీకేజీ, కరెంట్ లేదు, రైతులు తమ పశువులను తీసుకురావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై పశు వైద్యాధికారి స్వయంగా ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు. అర్జీ ఇచ్చి 2 నెలలు గడిచినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. మండల కార్యాలయం చుట్టూ తిరిగినా “చూస్తాం, చేస్తాం” అనే మాటలే తప్ప పని జరగలేదు.

చివరకు విసిగిపోయి హాస్పిటల్ సిబ్బందికలిసి స్థానికంగా ఉండే అసురీ మురళి పంతులు ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. విషయం తెలుసుకున్న మురళి పంతులు గారు మానవతా దృక్పథంతో స్పందించి, ఎవరి సహాయం కోసం ఎదురుచూడకుండా తన సొంత డబ్బులతో పశువైద్యశాలకు మరమ్మత్తులు చేయించారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒక వ్యక్తి తన సొంత ఖర్చుతో చేయాల్సి రావడం, ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చెబుతోంది.
ఇది ఒక్కటే కాదు, చాలా సమస్యలు పెద్ద శంకరంపేట ప్రధాన రహదారిపై నెలల తరబడి చెత్త పేరుకుపోయి ఉంది. దుర్వాసన భరించలేక ప్రజలు ముక్కు మూసుకుని వెళ్తున్నారు. దోమలు, రోగాల భయంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చెత్త తొలగించాలని ప్రజలు ఇప్పటివరకు ప్రజావాణిలో 4 సార్లు అర్జీలు ఇచ్చారు. అయినా ఒక్కసారి కూడా అధికారులు స్పందించలేదు, చెత్త అలాగే ఉంది.
పశువైద్యశాల లాంటి ప్రభుత్వ ఆస్పత్రి సమస్యే 2 నెలలు తీరకపోతే, సామాన్య ప్రజలమైన మా సమస్యలు ఎవరు తీరుస్తారు? రోడ్డుపై చెత్త గురించి ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఇంకా ప్రజల సమస్యలు ఏం తీరుస్తారు?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజావాణిపై నమ్మకం కోల్పోయిన ప్రజలు ఇప్పుడు మండలంలో అర్జీ ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. నేరుగా మెదక్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

*ప్రజల డిమాండ్:*
మెదక్ కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని, పెద్ద శంకరంపేట మండలంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రజావాణి అర్జీలపై విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నడిరోడ్డుపై చెత్తను వెంటనే తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.