*అర్హులైన రైతులకు త్వరగా రుణాలు మంజూరు చేయాలి*
*కొందుర్గు చౌదరిగూడ పిఎసిఎస్ పాలక మండలి కార్యవర్గ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన చైర్మన్ తుమ్మలపల్లి అనిత జితేందర్ రెడ్డి*
*సమావేశంలో పాల్గొన్న సీఈవో నవీన్ కుమార్ సీనియర్ అధికారి మహమ్మద్ షరీఫ్, డైరెక్టర్లు, సిబ్బంది*
ఈరోజు కొందుర్గు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పాలకమండలి కార్యవర్గ సమావేశం జరిగింది
ఈ సందర్భంగా ముందుగా అధికారులు ఎజెండా చదివి వినిపించారు
తర్వాత చైర్మన్ గారు మాట్లాడుతూ అర్హులైన అందరికీ రుణాలు త్వరగా మంజూరు చేయాలని అలాగే అతి త్వరలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించుకుంటామని అంతకుముందే మన వద్ద దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన రైతులకు అందరికీ రుణాలు మంజూరు చేయాలని కోరారు
అలాగే రుణాలను రికవరీ కూడా సాధ్యమైనంత తొందరగా చేయాలని తెలిపారు
సహకార సంఘంలో పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరూ వారి వారికి కేటాయించిన పనులను సమర్థవంతంగా నిర్వహించి మన సంఘానికి మంచి పేరు తీసుకుని రావాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు భీమారం మానయ్య ,ఏజాజ్ అలీ,జగన్మోహన్ రెడ్డి, నర్సింలు, రాములు మల్లేష్,వెంకటేష్,నంద కుమారి కాశరత్నమ్మ, నారాయణ చారి, కూర వీరన్న మరియు సిబ్బంది పాల్గొన్నారు

