డంపింగ్ యార్డు ఎత్తివేతకై అఖిల పక్ష నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి—
జవహర్ నగర్ అక్టోబర్ 9 (ప్రజావాణి ప్రతినిధి )
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి సోమవారం రోజు ప్రజావాణిలో సమర్పించే వినతిపత్రంలో డిమాండ్ చేయనున్న జేఏసి.
–చైర్మన్ షేక్ షావలి అధ్యక్షతన జరిగిన బాగస్వామ్య సంస్థల కో కన్వీనర్ల సమావేశం.
జవహర్ నగర్ రాంకీ డంపింగ్ యార్డు ఎత్తివేతకై గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎంపి ఈటేల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, అధికార పార్టీ డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల పక్షం చేసిన నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటి(జేఏసీ) బాగస్వామ్య సంస్థలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. 2026, అక్టోబర్-09, శనివారం రోజు, కీసర సర్కీల్, జవహర్ నగర్ జీహెచ్ఎంసీ, ప్రగతినగర్, నీలం రాంచంద్రయ్య భవన్ లో చైర్మన్ షేక్ షావలి(ఐ.ఎఫ్.టి.యు) అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్వీనర్ ఉమామహేష్(సిపిఐ), కోశాధికారి పి.శివబాబు
(ఐ.ఎఫ్.టి.యు), గౌరవ సలహాదారులు ఎస్.కె.మీరా, రావల్ కోల్ నర్సింహ్మ గౌడ్, కో కన్వీనర్స్ గడ్డం సదానందం (సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్), వై.మల్లేష్(ఏ.ఐ.ఎఫ్.టి.యు.), కొన్నెవేణు (జర్నలిస్ట్), గడిపే సునీత (పిఓడభ్ల్యూ(విముక్తి)), వి.ప్రవీణ్(టియుసిఐ), డి.జాన్(పికెఎం), చంద్రమౌళి(పిడిఎం), మహ్మద్ పాషామియా(ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ), జయసుధ (పిఓడభ్ల్యూ), డి.స్వరూప(పిఓడభ్ల్యూ), ఎం.డి.జావేద్(బహుజన రక్షణ సమితి), షేక్ మస్తాన్ బీ (కార్మిక మహిళా సమాఖ్యా), బండకింది సింగరయ్య గౌడ్(బహుజన సత్త), మబ్బు బాలు(టివిఐవి), సురేందర్(విఆర్ఆర్ హోమ్స్), మహ్మద్ రషీద్(జర్నలిస్ట్) తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు. సినిమా యాక్టర్ నానపటేకర్ కు మరియు డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో అనారోగ్యాలతో మరణించిన బొల్లం కృష్ణ లాంటి వారికి సంతాప సూచికంగా రెండు నిముషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. జూలై-26న జరిగిన డంపింగ్ యార్డు వ్యతిరేక సదస్సు తర్వాత పోరాట కమిటీలో ప్రజల ప్రత్యేక్ష బాగస్వామ్యం కొరకు తీవ్రంగా చేసిన కృషిని తెలియజేశారు. బలమైన డంపింగ్ యార్డు వ్యతిరేక ఉద్యమ నిర్మాణానికి భవిష్యత్ కార్యచరణను రూపొందించు కొన్నామని పేర్కొన్నారు. సోమవారం రోజు మల్కాజిగిరి మున్సిపల్ కమీషనర్ గారికి ప్రజావాణిలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించ బోతున్నట్లు ప్రకటించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డంపింగ్ యార్డు ఎత్తివేతకై ఏర్పాటు చేసిన అఖిలపక్ష కమిటి ఉత్తుత్తి కమిటిగా మార్చకుండా, ఆ కమిటీ చేసిన న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనియేడల మరో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, సమగ్రంగా ప్రజా అభిప్రాయ సేకరణ జరిపి, శాశ్వతంగా డంపింగ్ యార్డును జవహర్ నగర్ ప్రాంతం నుండి తొలగించాలని తెలియజేశారు.చెత్త డంపింగ్ యార్డు నుండి వెదజల్లే కంటికి కనిపించని విష వాయులు, పొగలు, దుర్వాసన, కలుషిత నీరు, గాలి వల్ల ప్రత్యక్షంగా 10 లక్షలు, పరోక్షంగా 30 లక్షల మంది ప్రజాల ప్రాణాలకు ప్రమాదకరంగా మారడమే గాకుండా, వారంలో తీవ్ర అనారోగ్యానికి గురై లన్స్, కడ్ని లాంటి వ్యాదులతో ఇద్దరు లేదా ముగ్గురు మరణిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి మరణాలపై ప్రభుత్వం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, త్రాగు నీరు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పర్యావరణాన్ని, ప్రకృతిని, రాజ్యాంగ విలువలను ద్వంసం చేసి, జీవించే హక్కును కాలరాస్తున్న రాంకీ యాజమాన్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవరించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల ప్రజలు జేఏసి చేస్తున్న శ్రమను గుర్తించి, స్వచ్చందగ డంపింగ్ యార్డు ఉద్యమంలో బాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

