*రైతుల ఇబ్బందులు గుర్తించి సొంత ఖర్చులతో పొలాలకు దారి ఏర్పాటు చేసిన సర్పంచ్!*
• ముని మాణిక్యం గ్రామ సర్పంచ్ పడమటి రమేష్‌కు రైతుల అభినందనలు
మన సమగ్ర ప్రజావాణి
(ముని మాణిక్యం) అక్టోబర్ 10 జిల్లా ప్రతినిధి
పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ పడమటి రమేష్ తన సొంత డబ్బులతో పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయించారు. రైతుల సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చి, స్వయంగా ఖర్చు భరించి దారి వేయించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే దారి ఎంతో అవసరం. ఈ సమస్యను గుర్తించి సర్పంచ్ పడమటి రమేష్ స్పందించి దారి ఏర్పాటు చేయించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ముందుకు వచ్చిన సర్పంచ్‌ను పలువురు అభినందిస్తున్నారు.

