📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి..
పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
ప్రజావాణి,నెల్లికుదురు:జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మండల వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని షెడ్యూల్ ప్రకారం మెడికల్ క్యాంపులో నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యా సంస్థలలో పిల్లలకు వంట చేసే సిబ్బందికి కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, సంబంధిత నివేదికలు తమకు సమర్పించాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, గర్భిణీలకు పిల్లలకు బాలింతలకు సంబంధించిన టీకాలు క్రమం తప్పకుండా వేయాలని, మాతా శిశు మరణాలను అరికట్టాలని, హాస్పిటల్ కి వచ్చే ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ మెడిసిన్ రిజిస్టర్ లను అటెండెన్స్ రిజిస్టర్లు తనిఖీ చేశారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ల వారీగా మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, పిల్లలకు వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం వేయాలి, బోద కాలు, గర్భ సంచీ క్యాన్సర్ ల నివారణ చర్యలు తీసుకోవాలని, సూచించారు.

*పట్టుదలతో విద్యను అభ్యసించాలి..*

కలెక్టర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి ప్రతి తరగతి గదిని తనిఖీ చేసి పిల్లలతో స్వయంగా మాట్లాడి భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక పై వారిని అడిగి తెలుసుకున్నారు,క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని ప్రతి సబ్జెక్టుపై నాలెడ్జి పెంచుకోవాలని సూచించారు, ప్రతి విద్యార్థినీ ,విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ లోనే భవిష్యత్తు కార్యాచరణ పై అడుగులు పడతాయని గుర్తుకు చేశారు, పిల్లలు ,ఉపాధ్యాయుల హాజరు శాతం పూర్తిగా నమోదయ్యే విధంగా ప్రిన్సిపల్ చర్యలు తీసుకోవాలని, ఇంగ్లీష్ తో పాటు ప్రతి సబ్జెక్టు పై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వంద శాతం ఉత్తీర్ణత పొందే విధంగా విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు,
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మదర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రవి రాథోడ్, నెల్లికుదురు తహసిల్దార్ చంద నరేష్, కళాశాల ప్రిన్సిపల్ కె.వీరస్వామి, ప్రాథమిక వైద్యశాల అధికారి డా.రమ్య తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.