📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనిరుద్యోగులకు భరోసా - రూ. 2,25,000 విలువైన స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ

నిరుద్యోగులకు భరోసా – రూ. 2,25,000 విలువైన స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ

📰 Generate e-Paper Clip

*నిరుద్యోగులకు భరోసా – రూ. 2,25,000 విలువైన స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ*

*సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ అధ్యక్షులు యసారపు కర్ణాకర్, రాచకొండ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాచకొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి):
పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ అండగా నిలిచింది.

సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ అధ్యక్షులు యసారపు కర్ణాకర్ అధ్యక్షతన, రాచకొండ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, NSUI సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రాచకొండ ప్రశాంత్ సహకారంతో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగార్థులకు రూ. 2,25,000 విలువైన స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఉద్యోగార్థులు పాల్గొని స్టడీ మెటీరియల్ పొందారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు యసారపు కర్ణాకర్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధనలో భాగంగా విద్యార్థులకు విద్యను అందించడమే తమ లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

రాచకొండ ప్రశాంత్ గారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులు డబ్బులు లేక కోచింగ్ కు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని, వారికి తమ వంతు సహాయంగా ఈ పుస్తకాలను అందిస్తున్నామని, పోలీస్ ఉద్యోగాల్లో జనగామ బిడ్డలు ఎక్కువ మంది సెలెక్ట్ కావాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో RTA మెంబర్ అభిగౌడ్, 4వ వార్డు కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్, జేరిపోతుల రాజశేఖర్, రమేష్, రామకృష్ణ, గొంగళ్ల కుమార్, నర్సింగరావు, శ్రీనివాస్, జగదీష్, ఫౌండేషన్ సభ్యులు, NSUI నాయకులు, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.