📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్30న అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా

30న అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా

📰 Generate e-Paper Clip

30న అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలోని అవకతవకలు మరియు అప్రజాస్వామ్యంగా మన భారతీయుల సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపు మరియు 3, 4 కోట్ల ఓటర్లకు తగిన గుర్తింపు కార్డులు లేవని నోటీసులు ఇవ్వడం, ఓటర్ల జాబితాలో మార్పులు చేసే అధికారాన్ని కూడా ఎలక్షన్ కమీషన్ తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న విధానం, వీటన్నింటికీ ప్రధాన సూత్రధారి అయిన చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెసు పార్టి ఉరవకొండ సమన్వయకర్త వై మదుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతనిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటి ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు వైఎస్ షర్మిలా రెడ్డి పిలుపుమేరకు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తేదీ.30.09.2026 (బుధవారం) జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉదయం 11:00 గం.లకు ఓటు చోరీ అవకతవకలపై భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్, జిల్లా, నగర నాయకులు, వివిధ విభాగాల సంబంధించిన అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారుపిలుపునిచ్చారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.