*ప్రజావాణి న్యూస్ ఎఫెక్ట్ – జిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడికి అండగా నిలిచిన జేఏసీ నాయకుడు*
*జిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడు నేడు మంచానికే పరిమితం – అనే వార్తకు స్పందన*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రజావాణి): జనగామ జిల్లా ఉద్యమకారుడు ఇరుగు రమేష్ గుండె సంబంధిత సమస్యతో గాంధీ హాస్పిటల్ లో చేరి ఆపరేషన్ కు రూ.20,000 అవసరమై దాతల కోసం ఎదురుచూస్తున్నారని మన సమగ్ర ప్రజావాణి తెలుగు డైలీ లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఆ కథనానికి స్పందనగా జనగామ జిల్లా జేఏసీ నాయకుడు, హైకోర్టు అడ్వకేట్ ఎండి సాదిక్ అలీ గాంధీ హాస్పిటల్ కు వెళ్లి ఇరుగు రమేష్ ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
వైద్య ఖర్చుల నిమిత్తం సాదిక్ అలీ రూ.12,500, ఇతర దాతల సహకారంతో రూ.4,500 కలిపి మొత్తం రూ.17,000 ఆర్థిక సాయాన్ని అందించి మనోధైర్యం కల్పించారు. ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
*ఉద్యమకారుడు ఇరుగు రమేష్ గురించి:*
ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలి, జిల్లా కోసం టవర్ ఎక్కి 5-6 గంటలు నిరసన తెలిపి, బస్సు దగ్ధం కేసులో 14 రోజులు వరంగల్ సెంట్రల్ జైల్లో జైలు జీవితం అనుభవించిన వ్యక్తి. తల్లిదండ్రులను కోల్పోయి ప్రస్తుతం పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులు మంతెన మణికుమార్, వంగ భీమ్ రాజ్ మాట్లాడుతూ ప్రజావాణి న్యూస్ లో వార్త రావడంతో స్పందించి సాయం చేసిన సాదిక్ అలీ గారికి, దాతలకు, పేపర్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారులంతా ఐక్యంగా ఉండి ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

