📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతొగరుపల్లి జడ్పిహెచ్ఎస్ స్కూల్లో నమూనా పార్లమెంట్

తొగరుపల్లి జడ్పిహెచ్ఎస్ స్కూల్లో నమూనా పార్లమెంట్

📰 Generate e-Paper Clip

తొగరుపల్లి జడ్పిహెచ్ఎస్ స్కూల్లో నమూనా పార్లమెంట్

సంగారెడ్డి, సెప్టెంబర్‌ 29(ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

కొండాపూర్‌ మండలంలోని తొగరుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో వినూత్నంగా నమూనా పార్లమెంట్‌ నిర్వహించారు. పార్లమెంట్‌ పనితీరు, ప్రభుత్వ పాలనపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

నమూనా పార్లమెంట్‌లో యూసుఫ్‌ బాబా స్పీకర్‌గా, నైనిక ప్రధానమంత్రిగా, మీనాక్షి విద్యాశాఖ మంత్రిగా, మౌనిక ఆర్థిక మంత్రిగా, రిషిత ఆరోగ్యశాఖ మంత్రిగా, సురేష్‌ రవాణాశాఖ మంత్రిగా, గుండప్ప వ్యవసాయశాఖ మంత్రిగా, క్రీస్తురాజు పర్యావరణశాఖ మంత్రిగా వ్యవహరించారు.

ప్రతిపక్ష సభ్యులుగా కృష్ణవేణి, శివాని, మధు, సఫీనా, విష్ణుసాయి, రేవంత్‌, నవాజ్‌, ఐషు పాల్గొన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన చర్చల ద్వారా పార్లమెంట్‌ ఎలా నిర్వహించబడుతుంది, ప్రభుత్వం ఎలా పరిపాలన సాగిస్తుంది అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దశరథ్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. భావి భారత పౌరులుగా విద్యార్థులు తీర్చిదిద్దేందుకు నమూనా పార్లమెంట్‌ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

అనంతరం నమూనా పార్లమెంట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.