📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు.. చికిత్సకు ఆర్థిక సాయం అందించండి కుటుంబ సభ్యులు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు.. చికిత్సకు ఆర్థిక సాయం అందించండి కుటుంబ సభ్యులు

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు.. చికిత్సకు ఆర్థిక సాయం అందించండి కుటుంబ సభ్యులు

నాలుగు నెలల క్రితమే వివాహం.. ప్రాణాపాయ స్థితిలో వినోద్ కుమార్
వైద్య ఖర్చుల కోసం దాతల సాయం కోరుతున్న కుటుంబ సభ్యులు
మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న యువకుడి వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరుతున్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన శివునూరి వినోద్ కుమార్ (26) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాలుగు నెలల క్రితమే వివాహమైన వినోద్‌కు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలను కాపాడేందుకు ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదుపుతప్పిన కారు.. లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు వినోద్ కుమార్ ఉద్యోగ విధులు ముగించుకుని స్నేహితుడితో కారులో అలియాబాద్ నుంచి రాజ బొల్లారానికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో టీ తాగేందుకు అలియాబాద్‌లోని పిస్తా హౌస్‌కు వెళ్లారు. టీ తాగి తిరిగి వస్తుండగా మజీద్‌పూర్ ఎక్స్‌రోడ్ వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వినోద్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని మేడ్చల్‌లోని సంప్రద హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి
వినోద్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు భారీగా వైద్య ఖర్చులు అవుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు నెలల క్రితమే వివాహమైన వినోద్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడని, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం ఇప్పటివరకు తమ వద్ద ఉన్న మొత్తాన్ని వైద్య ఖర్చులకు వెచ్చించామని, ప్రస్తుతం చికిత్స ఖర్చులు భరించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దాతలు ఆదుకోవాలని వేడుకోలు వినోద్‌కు అత్యవసరంగా మెరుగైన వైద్యం అవసరమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవాభావం కలిగిన వ్యక్తులు తమకు తోచినంత ఆర్థిక సాయం అందించి వినోద్ చికిత్సకు అండగా నిలవాలని కోరుతున్నారు. చిన్న మొత్తంలో చేసిన సహాయం కూడా ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక సాయం అందించేందుకు ఫోన్‌పే నంబర్:
📱 9347685596
మీ చిన్న సహాయం.. ఒక కుటుంబానికి పెద్ద అండగా నిలవొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.