📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

*మన ప్రజావాణి*
మంచిర్యాల సెప్టెంబర్ 28

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సుందిళ్ల రాజయ్య తనకు చెందిన పట్టా భూమి నిషేధిత జాబితాలో ఉందని, సవరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కవ్వాల్ ఫిషర్మెన్ కో- ఆపరేటివ్ సొసైటీ సభ్యులు తమ సంఘంలో అనర్హులను తొలగించి అర్హత కలిగిన వారికి సభ్యత్వం కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాసిపేట మండలం కోమటిచేను గ్రామానికి చెందిన జాడి అనసూర్య తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కొరకు దరఖాస్తు చేసుకున్నానని, కాగా తన దరఖాస్తు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లిందని, మంచిర్యాల జిల్లాకు మార్పు చేసి పథకం ప్రయోజనం అందించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆలేటి భాగ్యలక్ష్మి తనకు ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తింపచేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాజీపేట మండలం సోమగూడెం ట్యాంక్ బస్తీకి చెందిన భుఖ్య జ్యోతి కాజీపేట ఓపెన్ కాస్ట్ లో తన భూమి కోల్పోయానని, ఎంజాయ్మెంట్ సర్వేలో తన పేరు వచ్చినప్పటికీ కొందరు వ్యక్తులు తన పేరును తొలగించారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామానికి చెందిన తౌట సువర్ణ తనకు గ్రామ శివారులో భూమి ఉందని, రిజిస్టర్డ్ కొనుగోలు దస్తావేజు ద్వారా నేను కొనుగోలు చేసిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెందిన షేక్ తాజుద్దీన్ తమ గ్రామంలోని బస్టాండు సమీపంలో అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించి విద్యుత్ తీగలు తెగిపడడం, అగ్గి రవ్వలు రావడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చెన్నూర్ మండలం కొమ్మెర గ్రామానికి చెందిన నోముల సుప్రజ తాను ఎం పి హెచ్ డబ్ల్యు పూర్తి చేశానని, తనకు చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తగా ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణం జాఫర్ నగర్ ప్రాంతానికి చెందిన నసీం బేగం తన ఇంటి ప్రాంతంలో పారిశుధ్యం, మురుగు కాలువ శుభ్రతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కు చెందిన బొడ్డుపల్లి రజిత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరై చివరి విడత ఫోటో అప్లోడ్ చేయడం జరిగిందని, బిల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో 49 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.