📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజావాణికి 11 ఫిర్యాదులు

ప్రజావాణికి 11 ఫిర్యాదులు

📰 Generate e-Paper Clip

*ప్రజావాణికి 11 ఫిర్యాదులు*

*సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం*

అధికారులు

నంగునూరు, సెప్టెంబర్ 28:

నంగునూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో సీహెచ్‌. శ్రీనివాస్‌, తహశీల్దార్‌ ప్రవీణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌ కమిటీ పరిధిలోని 10 షట్టర్లకు రీ-టెండర్‌ నిర్వహించి నిజమైన వ్యాపారులకు అవకాశం కల్పించాలని దేవులపల్లి నవీన్‌ ఫిర్యాదు చేశారు. షట్టర్ల కేటాయింపులో పారదర్శకత పాటించి మధ్యవర్తుల ప్రమేయాన్ని అరికట్టాలని కోరారు. నంగునూరు ఎస్సీ కాలనీలో నెలకొన్న లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. తక్కువ వోల్టేజీ కారణంగా ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, మిక్సీలు తదితర విద్యుత్‌ ఉపకరణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. మగ్ధుంపూర్‌ గ్రామానికి చెందిన పామాయిల్‌ రైతు తన పామాయిల్‌ తోటల మధ్య నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్‌ వైర్లను పక్కకు మార్చాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గాలి దుమారం సమయంలో విద్యుత్‌ వైర్లు పామాయిల్‌ చెట్లకు తగిలి మంటలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. వైర్లను మార్చేందుకు అయ్యే ఖర్చు రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని వాపోయారు. విద్యుత్‌ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సీహెచ్‌. శ్రీనివాస్‌, తహశీల్దార్‌ ప్రవీణ్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.