📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్చెన్నారెడ్డిపేట చెరువు వద్ద అక్రమ మట్టి మాఫియా గుట్టురట్టు: లారీలను అడ్డుకున్న నాగేందర్ రెడ్డి, గ్రామస్థుల...

చెన్నారెడ్డిపేట చెరువు వద్ద అక్రమ మట్టి మాఫియా గుట్టురట్టు: లారీలను అడ్డుకున్న నాగేందర్ రెడ్డి, గ్రామస్థుల ఆగ్రహం!

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల,వైఎస్ఆర్ కడప జిల్లా:సెప్టెంబర్ 26 ప్రజావాణి పోరుమామిళ్ల పరిధిలోని చెన్నారెడ్డిపేట రెవెన్యూ పొలంలో దర్జాగా సాగుతున్న అక్రమ మట్టి దందాను స్థానికులు రట్టు చేశారు. సర్వే నెంబర్ 72 లోని నాలుగు ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణంలో, చిన్నారెడ్డిపేట చెరువు సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా సాగుతున్న మట్టి తవ్వకాలను స్థానిక నాయకుడు, సామాజిక కార్యకర్త మట్టి నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు శనివారం అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న లారీలను నిలిపివేసి, అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

అనుమతులు లేవు.. దోపిడీయే ధ్యేయం:

గత కొన్ని రోజులుగా చిన్నారెడ్డిపేట చెరువు పరివాహక ప్రాంతం నుంచి నిత్యం పదుల సంఖ్యలో లారీలు, టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. ఈ విషయంపై స్పందించిన మట్టి నాగేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, మట్టిని తరలిస్తున్న వాహనదారులను, నిర్వాహకులను నిలదీశారు. మైనింగ్ లేదా రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అధికారిక అనుమతి పత్రాలు (పర్మిషన్లు) లేవని తేలడంతో, ఆయన లారీల రాకపోకలను అడ్డుకున్నారు.ప్రభుత్వ సంపదను కొల్లగొడుతూ, చెరువు ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిద్రపోతున్న రెవెన్యూ యంత్రాంగం – గ్రామస్థుల కోపం:

ఈ అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పగటిపూటే జేసీబీలతో తవ్వకాలు జరుపుతూ, లారీల్లో మట్టిని తరలిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం కంటిచూపుతోనైనా చూడకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. “రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మా కళ్ల ముందే ప్రకృతి సంపద దోపిడీకి గురవుతుంటే అధికారులు నిద్రపోతున్నారా? లేక అక్రమార్కులతో చేతులు కలిపారా?” అంటూ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.

పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు:

నాలుగు ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రెవెన్యూ భూమి, చెరువుకు ఆనుకుని ఉండటం వల్ల ఇక్కడ జరుగుతున్న భారీ తవ్వకాలతో భూగర్భ జలాల మట్టం పడిపోయే ప్రమాదం ఉందని, రాబోయే రోజుల్లో చెరువు కట్ట బలహీనపడే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందించాలి: ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు, మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పోరుమామిళ్ల మండలంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై విచారణ జరపాలని మట్టి నాగేందర్ రెడ్డి మరియు చెన్నారెడ్డిపేట గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, ఈ దందా వెనుక ఉన్న సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రెవెన్యూ కార్యాలయం ముట్టడితో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించరు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.