📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎన్ ఎస్ ఎస్ దినోత్సవం మరియు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఎన్ ఎస్ ఎస్ దినోత్సవం మరియు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఎన్ ఎస్ ఎస్ దినోత్సవం మరియు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ప్రజావాణి సెప్టెంబర్ 26 కమలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కమలాపూర్ లో జాతీయ సేవా పతాకం ఎన్ఎస్ఎస్ దినోత్సవ మరియు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జి కుమార్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సేవాభావం క్రమశిక్షణ సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు సమాజ సేవలో యువత చురుగ్గా పాల్గొని ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించాలని సూచించారు

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ A జ్యోతి గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులు సేవా కార్యక్రమాలు పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ ఆరోగ్య అవగాహన వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు “not me But you” అనే ఎన్ఎస్ఎస్ నినాదం స్ఫూర్తితో సమాజ సేవకు ప్రతి విద్యార్థి ముందుకు రావాలని పిలుపునిచ్చారు

అనంతరం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర ధైర్య సాహసాలు సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం గురించి విద్యార్థులకు వివరించారు తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ ధైర్యానికి ఆత్మగౌరవానికి ప్రతికగా నిలిచాలని వ్యక్తులు పేర్కొన్నారు ఆమె జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏ జ్యోతి కళాశాల అధ్యాపకులు రజిత కవిత చంద్రశేఖర్ సరోజన కుమారస్వామి శోభ సురేష్ లైబ్రేరియన్ జనార్ధన్ బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సామాజిక సేవ పరిశుభ్రత మరియు బాధ్యతాయుత పౌరసత్వం పై ప్రతిజ్ఞ చేయించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.