📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ఘనంగా సత్కరించిన పీఆర్‌టీయూ టీఎస్ మండల శాఖ

​పరిగి సెప్టెంబర్ 26(ప్రజావాణి)

విద్యా రంగానికి విశేష సేవలందిస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను పీఆర్‌టీయూ టీఎస్ కుల్కచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల శాఖ ప్రతినిధులు వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
​సన్మానం పొందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు:
​శ్రీ కావలి శ్రీశైలం – స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలురు), కుల్కచర్ల
​శ్రీ విస్లావత్ తులసి నాయక్ – స్కూల్ అసిస్టెంట్ (గణితం), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సాల్వీడ్
​శ్రీ కొండ ఎల్లయ్య – స్కూల్ అసిస్టెంట్ (జీవశాస్త్రం), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ముజాహిద్‌పూర్
​శ్రీ భక్తవత్సల్ – స్కూల్ అసిస్టెంట్ (హిందీ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలికలు), కుల్కచర్ల
​ఎం ఆంజనేయులు – స్కూల్ అసిస్టెంట్ (భౌతికశాస్త్రం), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పుట్టపహాడ్
​ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకులు మాట్లాడుతూ, నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమిస్తూ జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడం మండలానికే గర్వకారణమని కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ టి యు మండల అధ్యక్షుడు శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి దస్తయ్య, గౌరవ అధ్యక్షుడు డి వెంకటయ్య,పెంటయ్య,బస్వరాజు,ఆనంద్, రాఘవేందర్ రెడ్డి, శేఖర్,మండల పీఆర్‌టీయూ పలు పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.