చెన్నారెడ్డిపేట చెరువు వద్ద అక్రమ మట్టి మాఫియా గుట్టురట్టు: లారీలను అడ్డుకున్న నాగేందర్ రెడ్డి, గ్రామస్థుల ఆగ్రహం!

పోరుమామిళ్ల,వైఎస్ఆర్ కడప జిల్లా:సెప్టెంబర్ 26 ప్రజావాణి పోరుమామిళ్ల పరిధిలోని చెన్నారెడ్డిపేట రెవెన్యూ పొలంలో దర్జాగా సాగుతున్న అక్రమ మట్టి దందాను స్థానికులు రట్టు చేశారు. సర్వే నెంబర్ 72 లోని నాలుగు ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణంలో, చిన్నారెడ్డిపేట చెరువు సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా సాగుతున్న మట్టి తవ్వకాలను స్థానిక నాయకుడు, సామాజిక కార్యకర్త మట్టి నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు శనివారం అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న లారీలను నిలిపివేసి, అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు....