📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriక్రీడల్లో పూలే పాఠశాల విద్యార్థుల విజయకేతనం

క్రీడల్లో పూలే పాఠశాల విద్యార్థుల విజయకేతనం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, సెప్టెంబర్ 25 (ప్రజావాణి): 70వ ఎస్జీఎఫ్ ఘట్కేసర్ జోన్ జోనల్ లెవెల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే మల్కాజ్‌గిరి బాయ్స్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కబడ్డీ అండర్-14 బాలుర విభాగంలో, వాలీబాల్ అండర్-17 బాలుర విభాగంలో విజేతలుగా నిలిచారు. అలాగే ఖో-ఖో అండర్-14, అండర్-17 బాలుర విభాగాల్లోనూ విజేతలుగా నిలిచి విజయకేతనం ఎగురవేశారు.

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల విజయంపై పాఠశాలలో హర్షం వ్యక్తమైంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మెహతా, ఏటీపీ సాయి చందర్, పీడీ నాగరాజుతో పాటు అధ్యాపకులు విద్యార్థులను అభినందించి, జిల్లా స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.