📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్దళితులు అనుభవంలో ఉన్న భూములను భూకబ్జా చేసిన వారిని అరెస్టు చేయాలి*

దళితులు అనుభవంలో ఉన్న భూములను భూకబ్జా చేసిన వారిని అరెస్టు చేయాలి*

📰 Generate e-Paper Clip

కాశి నాయన సెప్టెంబర్ 26 ప్రజావాణి మండల పరిధిలోని నాయన పల్లె రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 129 130 217 లో వందలు ఎకరాలు ప్రభుత్వ భూములు పేదలు దళితులు సాగుచేసిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వరి కుంట్ల నాయన పల్లె దళితులు పేదలు పై దాడి చేసిన వైసిపి నాయకులు సత్యనారాయణ రెడ్డి ఆలయాస్ (నల్ల సత్యం) వారి కుమారుడు గోవింద్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు రఘు కడప జిల్లా సిటిజన్ ఫోరం న అధ్యక్షులు కుమారస్వామి రెడ్డి డిమాండ్ చేశారు.శనివారం ఉదయం జిల్లా జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ మల్లికార్జునుడు కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ మాట్లాడుతూ కాశి నాయన మండల పరిధిలోని నాయన పల్లె రెవెన్యూ పొలంలో 2018 సంవత్సరం నుంచి వరికుంట్ల, నాయన పల్లె గ్రామాల పేదలు దళితులు సాగు చేస్తున్న భూములను దౌర్జన్యంగా అగ్రవర్ణాలు భూకబ్జాదారులు వైసిపి ప్రభుత్వం లో స్థానిక రెవెన్యూ అధికారులను ప్రలోభాలుకు గురిచేసి వందల ఎకరాలు వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. గత ఐదు రోజుల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వరికుంట్ల నాయన పల్లె గ్రామాల పేదలు భూముల మీదికి పోతే దళితులపై గ్రామీణ ధనిక పెత్తందారులు భౌతిక దాడులకు దిగుతున్నారు. రెవిన్యూ అధికారులును , పోలీస్ అధికారులను రాజకీయ పలుకుబడి కలిగిన పెత్తందారులు అగ్రవర్ణాలు పేదలకు భూములు దక్కకుండా కెసులుకు ఉసికల్పుతున్నారు. వెంటనే అగ్రవర్ణాలు భూకబ్జాదారులు అయిన సత్యనారాయణ రెడ్డి వారి కుమారుడు గోవింద్ రెడ్డి భూకబ్జాదాలను అరెస్టు చేయాలని, అదేవిధంగా భూ అక్రమ దార్ల కింద పీడీ యాక్ట్ వెసులు నమోదు చేయాలని ప్రభుత్వా అధికారులును డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కెవిపియస్ జిల్లా అధ్యక్షులు పెసల రఘు, కడప జిల్లా సిటిజన్ ఫోరం అధ్యక్షులు కుమారస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.