📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొన్న వైస్ చైర్మన్ జావేద్

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొన్న వైస్ చైర్మన్ జావేద్

📰 Generate e-Paper Clip

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొన్న వైస్ చైర్మన్ జావేద్

జమ్మికుంట సెప్టెంబర్ 26 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలో నేడు చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ జావేద్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వనికి వారి పక్షాన మరియు రజక సంఘం కుటుంబసభ్యుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం,భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత
చాకలి ఐలమ్మ అలాంటి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి,వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆర్ ఐ భాస్కర్,ఏఈ వికాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్,వార్డు ఆఫీసర్స్, కార్యాలయ సిబ్బంది రజక సంఘం అధ్యక్షులు వరంగంటి సదానందం బూరుగుపల్లి రాము, గంగారపు శ్రీకాంత్ రజక సంఘం నాయకులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.